బెల్లంకొండ టైటిల్ 'సాక్ష్యం'..!

నిర్మాత బెల్లంకొండ సురేష్ తనయుడిగా హీరోగా ఎంట్రీ ఇచ్చిన శ్రీనివాస్ రీసెంట్ గా జయ జానకి నాయకా సినిమాతో పర్వాలేదు అనిపించుకున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత శ్రీవాస్ డైరక్షన్ లో సినిమా చేస్తున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్. డిజె పాప పూజా హెగ్దె హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు టైటిల్ గా సాక్ష్యం అని పెట్టబోతున్నారట.

ఇదవరకు లక్ష్యం సినిమా తీసిన శ్రీవాస్ ఆ సినిమా హిట్ అవ్వగా గోపిచంద్ తో సౌఖ్యం సినిమా తీశాడు. అయితే అది ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఇక బాలయ్యతో డిక్టేటర్ సినిమా తీసిన శ్రీవాస్ ఏడాదికి పైగా గ్యాప్ తీసుకుని బెల్లంకొండ శ్రీనివాస్ తో సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. మరి సాక్ష్యం అంటున్న శ్రీనివాస్ సినిమాతో ఎలాంటి ఫలితాన్ని అందుకుంటాడో చూడాలి.