మహానటి ఫస్ట్ లుక్.. బర్త్ డే స్పెషల్ అదిరింది..!

మహానటి సావిత్రి బయోపిక్ గా నాగ్ అశ్విన్ డైరక్షన్ లో వస్తున్న సినిమా మహానటి. వైజయంతి మూవీస్ బ్యానర్లో స్వప్న దత్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. సినిమాలో మహానటి సావిత్రి పాత్రలో మలయాళ ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నటిస్తున్నారు. ఇక ఈరోజు ఆమె పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. చూస్తే సావిత్రి గారే అన్నట్టుగా ఈ ఫస్ట్ లుక్ ఉంది.

ఆకాశవీధిలో అందాల జాబిలీ అంటూ హ్యాపీ బర్త్ డే వన్ అండ్ ఓన్లీ మహానటి అని మహానటి సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. తెలుగులో చేసిన రెండు సినిమాలతోనే అభినయ తారగా గుర్తింపు తెచ్చుకున్న కీర్తి సురేష్ సౌత్ లో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ సంపాదించుకుంది. తెలుగు తమిళ భాషల్లో స్టార్స్ తో నటిస్తున్న ఈ అమ్మడు మహానటిగా తన నట విశ్వరూపం చూపిస్తుందని చెప్పొచ్చు.