
యాంగ్రీ యంగ్ మన్ రాజశేఖర్ ప్రస్తుతం చేస్తున్న సినిమా పిఎస్వి గరుడవేగ. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా ఇండియన్ సినిమా చరిత్రలోనే ఓ కొత్త కథతో వస్తుందని అంటున్నారు. రాజశేఖర్ కు జోడిగా దశావతారం పూజా కుమార్ జంటగా నటిస్తుండగా సినిమాలో స్పెషల్ ఎట్రాక్షన్ గా సన్ని లియోన్ ఐటం సాంగ్ కూడా ప్లాన్ చేశారు.
ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ తెచ్చుకోగా ఇప్పుడు ట్రైలర్ కు ఆడియెన్స్ అటెన్షన్ కు క్యాచ్ చేసేందుకు నందమూరి నట సింహం ను వాడుతున్నారు. బాలయ్య చేతుల మీదగా గరుడవేగ ట్రైలర్ రిలీజ్ కాబోతుంది. రేపు అనగా అక్టోబర్ 17 రాత్రి 8 గంటలకు గరుడవేగ ట్రైలర్ ఆర్కె సినిప్లెక్స్ లో రిలీజ్ చేయబోతున్నాడు బాలకృష్ణ. 20 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా హిట్ తో సత్తా చాటాలని చూస్తున్నాడు రాజశేఖర్.