
భద్ర సినిమాతో దర్శకుడిగా మారిన బోయపాటి శ్రీను తన ప్రతి సినిమాలో హీరోయిజం కొత్త ఉత్సాహంతో చూపిస్తాడు. బాలయ్య కు సింహా, లెజెండ్ సినిమాలను ఇచ్చిన బోయపాటి అల్లు అర్జున్ కు సరైనోడు సినిమాతో బ్లాక్ బస్టర్ ఇచ్చాడు. రీసెంట్ గా జయ జానకి నాయకా సినిమాతో మరోసారి తన సత్తా చాటిన బోయపాటి తన తర్వాత సినిమా చిరుతో చేద్దామనుకుంటే సైరా అయ్యేసరికి చాలా టైం పడుతుందని తెలిసి మళ్లీ బాలయ్యతోనే సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడు.
ఇక మరో పక్క మహేష్ కోసం కూడా ఓ కథను సిద్ధం చేశాడని తెలుస్తుంది. ఇవి రెండే కాకుండా ఈమధ్యనే చరణ్ కు ఓ అద్భుతమైన కథ వినిపించాడట బోయపాటి శ్రీను. కథ నచ్చడంతో చెర్రి వెంటనే ఓకే అన్నాడట. చిరు సినిమా ఉన్నా లేకున్నా బోయపాటి శ్రీను మాత్రం చరణ్ తో ఫిక్స్ అవుతున్నట్టు తెలుస్తుంది. మరి ఈ సినిమా గురించి మిగతా డీటేల్స్ ఏంటన్నది త్వరలో తెలుస్తుంది.