పటాస్ రవితేజ చేయాల్సిందట..!

మాస్ మహరాజ్ రవితేజ అనీల్ రావిపుడి డైరక్షన్ లో వస్తున్న సినిమా రాజా ది గ్రేట్. దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ లో డైరక్టర్ అనీల్ రావిపుడి మీద ప్రశంసల వర్షం కురిపించాడు రవితేజ. సినిమా విషయంలో అనీల్ కు మంచి క్లారిటీ ఉందని అందుకే అతనికి సక్సెస్ లు వస్తున్నాయని అన్నారు.

తను చేసిన దరవు టైంలోనే అనీల్ తనకు తెలుసని చెప్పిన రవితేజ అనీల్ మొదటి సూపర్ హిట్ మూవీ పటాస్ కథ ముందు తనకే చెప్పాడనికి కాని వేరే కమిట్మెంట్ ల వల్ల ఆ సినిమా తాను చేయలేదని అన్నాడు. ఇక రాబోతున్న రాజా ది గ్రేట్ మాత్రం తప్పకుండా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. సినిమాలో హీరో పాత్ర ఇంతవరకు ఎవరు టచ్ చేయలేదని అన్నాడు. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ చేసిన ఈ సినిమా అతన్ని హిట్ ట్రాక్ ఎక్కిస్తుందో లేదో చూడాలి.