ఆ రోల్స్ చేయనంటున్న స్టార్ హీరోయిన్..!

సౌత్ లో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న సమంత ఈమధ్యనే అక్కినేని వారి ఇంట కోడలు అయ్యింది. మనం తర్వాత నాగార్జునతో కలిసి రాజు గారి గది-2లో నటించింది సమంత. ఈ సినిమాలో సమంత చేసిన అమృత పాత్ర అందరికి నచ్చేసింది. ఇక నుండి పాత్ర ప్రాధాన్యత ఉన్న పాత్రలోనే నటిస్తా తప్ప హీరోయిజం కోసం స్టార్ చేస్తున్న సినిమాల్లో కేవలం పాటల కోసం నటించను అంటుంది సమంత. 

సినిమాలో తన పాత్రకు ప్రాముఖ్యత ఉంటే అది ఎలాంటి సినిమా అయినా చేస్తుందని అంటుంది. ఇప్పుడు పెళ్లి అయ్యింది కాబట్టి అలా అనడం ఒకే కాని ఆమెను స్టార్ హీరోయిన్ ను చేసి స్టార్స్ తో నటించబట్టే అన్న విషయం మర్చి పోయినట్టు ఉంది సమంత. పెళ్లి తర్వాత ప్రేక్షకులు ఈ సినిమా విజయంతో మంచి కానుక ఇచ్చారని అన్నది. ఇక సక్సెస్ మీట్ లో మామ నాగార్జున వేసిన జోకులకు సమంత పడి పడి నవ్వేసింది. ఓంకార్ డైరక్షన్ లో వచ్చిన రాజు గారి గది-2 సినిమాకు థమన్ మ్యూజిక్ అందించగా పివిపి సినిమాను నిర్మించారు.