స్పైడర్ నిర్మాతలకు మహేష్ హెల్ప్..!

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో భారీ బడ్జెట్ తో వచ్చిన సినిమా స్పైడర్. ఎన్.వి.ఆర్ మూవీ బ్యానర్లో 120 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా భారీ లాసులే తెచ్చిందని అంటున్నారు. పెట్టిన బడ్జెట్ లో 50 శాతం కూడా అతి కష్టం మీద రికవరీ అవ్వగా మిగతా బడ్జెట్ డిస్ట్రిబ్యూటర్స్ కు నష్టాలు మిగిల్చేలా ఉందట. అందుకే మహేష్ తన రెమ్యునరేషన్ నుండి నిర్మాతకు రిటర్న్ ఇచ్చే ఆలోచనలో ఉన్నాడట.

స్పైడర్ సినిమాకు 23 కోట్ల దాకా రెమ్యునరేషన్ తీసుకున్నాడట మహేష్. ఇక ఇప్పుడు లాసులు భర్తీ చేసేలా నిర్మాతకు సహాయం చేయబోతున్నాడట. తీసుకున్న రెమ్యునరేషన్ కొంత భాగం తిరిగి ఇచ్చేస్తున్నాడట. మహేష్ చేస్తున్న ఈ సాయం నిర్మాతకు కొంత ఊరట ఇస్తుందని చెప్పొచ్చు. స్టార్ సినిమా నిర్మాణ వ్యయం పెంచడం లాసులు వస్తే ఇలా హీరోల రెమ్యునరేషన్ లో కోత పెట్టడం ప్రస్తుతం నడుస్తూనే ఉంది. మహేష్ మంచి మనసున్న హీరో కాబట్టి ఎలాంటి గొడవ చేయకుండా రెమ్యునరేషన్ లో కొంత ఇచ్చేస్తున్నారట. ఈ విషయంలో మహేష్ ను కచ్చితంగా మెచ్చుకోవాల్సిందే.