
మలయాళ భామ అనుపమ పరమేశ్వరన్ చేసింది మూడు సినిమాలే అయినా అమ్మడికి తెలుగులో ఓ రేంజ్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఆమె సినిమాల సెలెక్షన్స్ లో కూడా మెచ్చుకునేలా ఉన్నాయి. ఈ ఇయర్ శతమానం భవతి అంటూ వచ్చి హిట్ అందుకున్న అనుపమ త్వరలో ఉన్నది ఒకటే జిందగి సినిమా ద్వారా రాబోతుంది. రామ్ సరన హీరోయిన్ గా నటించిన అనుపమ సినిమా ట్రైలర్ లో ఆకట్టుకునేలా ఉంది.
ఇక నిన్న రిలీజ్ అయిన ఆడియో వేడుకలో అనుపమ స్పీచ్ కూడా అందరిని అలరించింది. దశాబ్ధ కాలంగా తెలుగు పరిశ్రమలో ఉండి క్రేజ్ సంపాదించినా తెలుగు నేర్చుకోలేని భామలుండగా రెండు మూడు సినిమాల అనుభవంతోనే చక్కగా తెలుగు మాట్లాడేస్తుంది అనుపమ. ఆడియో వేడుకలో రామ్ ఎనర్జీ గురించి, దర్శకుడు కిశోర్ తిరుమల, నిర్మాత స్రవంతి రవికిశోర్ గురించి ఆమె మాట్లాడిన విధానం వారెవా అనేలా చేసింది. చేస్తున్న పని మీద ఆమె ఎంత శ్రద్ధ చూపిస్తుందో ఉన్నది ఒకటే జిందగి ఆడియో స్పీచ్ వింటే అర్ధమవుతుంది. ప్రస్తుతం యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న అనుపమ త్వరలో స్టార్స్ తో నటించే లక్కీ ఛాన్స్ కొట్టేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.