రామ్ ఏడుస్తాడా.. ఏడిపించేస్తాడా..!

ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నేను శైలజ సినిమాతో సక్సెస్ అందుకున్న కిశోర్ తిరుమల డైరక్షన్ లో వస్తున్న సినిమా ఉన్నది ఒకటే జిందగి. రామ్ రాక్ స్టార్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్, లావణ్య త్రిపాఠి హీరోయిన్స్ గా నటిస్తున్నారు. స్రవంతి క్రియేషన్స్ పతాకంలో స్రవంతి రవికిశోర్ నిర్మిస్తున్న ఈ సినిమా ఆడియో వేడుక నిన్న సాయంత్రం అంగరంగ వైభవంగా జరిగింది.  

ట్రైలర్ తోనే సినిమా కంటెంట్ చెప్పే కిశోర్ తిరుమల మరోసారి తొందరలోనే నువ్వు ఏడుస్తావు అంటూ డైలాగ్ చెప్పించి టచ్ చేశాడు. ఇక స్నేహం గొప్పతనం గురించి సినిమాలో ప్రత్యేకంగా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీవిష్ణు ఈ సినిమాలో సపోర్టింగ్ రోల్స్ లో నటిస్తున్నాడు. దేవి మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ యూత్ ను ఆకట్టుకుంటున్నాయి.  

ట్రైలర్ కూడా ఇంప్రెసివ్ గా అనిపిస్తుంది. అక్టోబర్ 27న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా రామ్ కెరియర్ లో మంచి హిట్ సినిమాగా నిలుస్తుందనే అంటున్నారు. ఇక పరిశ్రమకు ఎందుకొచ్చానో ఇన్నేళ్లకు తెలిసిందంటూ సినిమా బాగా వచ్చేందుకు ఫోర్ పిల్లర్స్ కిశోర్ తిరుమల, దేవి శ్రీ, సమీర్ రెడ్డి, నిర్మాత స్రవంతి రవికిశోర్ అని చెప్పాడు రామ్.