
జై లవ కుశ తర్వాత త్రివిక్రంతో సినిమా తీస్తాడని అనుకున్న తారక్ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఎలాగు లేటు అయ్యేట్టు ఉందని బడా నిర్మాత దిల్ రాజు ప్రాజెక్టుకు సైన్ చేయబోతున్నాడట. దిల్ రాజు ప్రొడక్షన్ లో యువ దర్శకుడు ఓ కథ చెప్పగా దానికి తారక్ ఓకే అన్నాడట. త్రివిక్రం సినిమాతో పార్లర్ గా ఆ సినిమా షూటింగ్ చేసే అవకాశం ఉందట. అందుకే త్రివిక్రం సినిమా షూటింగ్ స్టార్ట్ చేయడానికి ముందే ఈ సినిమాకు ముహుర్తం పెట్టబోతున్నారట.
టెంపర్ తర్వాత తారక్ సినిమాల సెలక్షన్స్ లో పరిణితి కనిపిస్తుంది. జనతా గ్యారేజ్ మాత్రమే కాదు జై లవ కుశలో మూడు పాత్రలతో అలరించిన ఎన్.టి.ఆర్ దానికి తగిన ఫలితాన్ని అందుకున్నాడు. కెరియర్ హిట్ జోష్ లో ఉన్న తారక్ 6 నెలలు టైం వేస్ట్ చేయడం ఇష్టం లేక దిల్ రాజు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ సినిమాకు సంబందించిన అఫిషియల్ స్టేట్మెంట్ త్వరలో వెళ్లడవనుంది.