
ఏమాయ చేసావే సినిమాతో కలిసి పనిచేసి అప్పటినుండి ప్రేమలో ఉన్న నాగ చైతన్య, సమంతలు ఫైనల్ గా పెళ్లితో ఒక్కటయ్యారు. ఈ నెల 6న హిందూ సాంప్రదాయంలో, 7న క్రిస్టియన్ సాంప్రదాయాలలో వీరి పెళ్లి జరిగింది. అయితే పెళ్లికి కేవలం 100 మంది అతిధులతోనే కానిచ్చేశారు. ఎవరేం గిఫ్ట్ లు పంపించారో ఏమో తెలియదు కాని చైతు, సమంతలకు పవర్ స్టార్ త్రివిక్రం మాత్రం స్పెషల్ గిఫ్ట్ సెండ్ చేశారట.
ఇద్దరికి చెరో డైమండ్ రింగ్ పంపించారట పవన్ త్రివిక్రం. త్రివిక్రం డైరక్షన్ లో అత్తారింటికి దారేది, సన్నాఫ్ సత్యమూర్తి, అఆ సినిమాల్లో నటించింది సమంత. ఇక అందులో అత్తారింటికి దారేది పవన్ హీరోగా చేసిందే. అందుకే ఇద్దరు కలిసి ఆ ప్రేమ జంటకు డైమండ్ రింగ్ కానుకగా పంపించారట. ఇక పెళ్లి తర్వాత సినిమా వళ్ల కోసం భారీ రిసెప్షన్ ప్లాన్ చేస్తారని అనుకున్నా అది ఎందుకో క్యాన్సిల్ చేశారని తెలుస్తుంది.