మహేష్ బావ కొత్త టర్న్ తీసుకున్నాడు..!

సూపర్ స్టార్ మహేష్ బావగా ఎస్.ఎం.ఎస్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు సుధీర్ బాబు. ఆ తర్వాత ప్రేమ కథ చిత్రం సినిమా అతనికి మంచి హిట్ ఇచ్చింది. డిఫరెంట్ కథలతో సినిమాలు చేస్తున్న సుధీర్ బాబు కొత్త అవతారం ఎత్తబోతున్నాడు అదే నిర్మాతగా మారబోతున్నాడన్నమాట. ప్రస్తుతం గోపిచంద్ మలినేని బయోపిక్ లో నటించబోతున్న సుధీర్ బాబు ఆ సినిమాతో పాటుగా రాజశేఖర్ నాయుడు అనే కొత్త కుర్రాడు చెప్పిన కథకు ఇంప్రెస్ అయ్యాడట.

ఇక నిర్మాతగా వేరే ఎవరినో అనుకోగా అతను చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చే సరికి సుధీర్ బాబు ఆ సినిమా నిర్మాణ బాధ్యతలను మోస్తున్నాడు. దర్శకుడు చెప్పిన కథ కథనాలు నచ్చబట్టే తాను నిర్మాతగా మారుతున్నాడట. యువ హీరోల్లో ఇప్పుడు కథల విషయంలో జాగ్రత్త ఎక్కువ అయ్యింది. స్టార్ సినిమా కూడా కంటెంట్ ఉంటేనే ఆడుతుంది కాబట్టి కుర్ర హీరోలు కూడా ఎక్కువ కథల మీదే దృష్టి పెడుతున్నారు. ఇక మంచి కథ అది మిస్ అవ్వకూడదు అనుకుంటే వారే నిర్మాతలను వెతకడమో లేక వారే ప్రొడ్యూస్ చేయడమో చేస్తున్నారు.

ఇప్పటికే నాని నిర్మాతగా మారేందుకు రంగం సిద్ధం చేస్తుండగా అంతకుముందే సుధీర్ బాబు నిర్మాతగా మారేశాడు. కళ్యాణ్ రాం ఓ పక్క తాతా పేరుతో పెట్టిన బ్యానర్లో సినిమాలు చేస్తున్నాడని తెలిసిందే.