
టాలెంటెడ్ హీరోయిన్ సమంతకు సౌత్ లో ఉన్న ఫాలోయింగ్ తెలిసిందే.. ఏమాయ చేసావే సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ చిన్నది ఆ సినిమా హీరో నాగ చైతన్యతో రియల్ లైఫ్ లవ్ ను కంటిన్యూ చేసింది. ఇక మొన్నీమధ్యే ఇద్దరు పెళ్లి కూడా చేసుకున్నారని తెలిసిందే. అలా పెళ్లి అయ్యిందో లేదో ఇలా తన మార్పుని చూపించేస్తుంది అక్కినేని కోడలు.
సోషల్ బ్లాగ్ లో తన పేరు ఇన్నాళు సమంత రుత్ ప్రభుగా ఉండగా ఇప్పుడు అక్కినేని సమంత అని పెట్టేసుకుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తా అంటున్న సమంత ఎలాంటి పాత్రలు చేయనుందో అని అక్కినేని ఫ్యాన్స్ కాస్త కన్ ఫ్యూజన్ లో ఉన్నారు. ప్రస్తుతం నాగార్జునతో చేసిన రాజు గారి గది-2 రిలీజ్ అవుతుంది.