రామాయణంపై కన్నేసిన ప్రభుదేవా

బాహుబలి వంటి బిగ్గెస్ట్ విజువల్ వండర్ ను తెరకెక్కించిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి.. తన సినిమాలకు మహాభారతం స్పూర్తి అని చాలా సంధర్భాలలో చెప్పుకొచ్చాడు. ఎప్పటికైనా మహాభారతం ను సినిమాగా తెరకెక్కించాలన్నదే తన కల అని చెప్పిన విషయం తెలిసిందే. అలాగే దర్శకరత్న దాసరి నారాయణ రావు కూడా ఎప్పటికైనా మహాభారతం సినిమాను తెరకెక్కిస్తానని ప్రకటించారు.  

వీరిద్దరూ కలిసి మహాభారతంపై కన్నేస్తే... దర్శకుడు, కొరియోగ్రాఫర్ ప్రభుదేవా మాత్రం రామాయణంపై కన్నేసాడు. రామాయణం తన డ్రీం ప్రాజెక్ట్ అని చెబుతున్నాడు. అంతే కాకుండా రామాయణాన్ని హాలీవుడ్ స్థాయిలో లార్డ్ ఆఫ్ ది రింగ్స్ తరహాలో రూపొందించడమే తన కల అని, అది ఎప్పుడు నెరవేరుతుందా అని ఆశతో ఎదురుచూస్తున్నానని చెప్పుకొచ్చాడు.

రామాయణం వంటి క్లాసిక్ హిస్టరీని ప్రభుదేవా తన స్టైల్లో చిత్రీకరిస్తే ఎలా వుంటుందో... మరి రామాయణాన్ని ఈ దర్శకుడి కంటే ముందుగా మరెవరైనా చిత్రీకరిస్తారో చూడాలి. ప్రస్తుతం ప్రభుదేవా హీరోగా నటిస్తున్న అభినేత్రి సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ కు భారీ రెస్పాన్స్ వస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.