'భేటీ బచావో.. భేటీ పడావో' తెలంగాణా ప్రచారకర్తగా రకుల్..!

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమానికి బ్రాండ్ అంబాసిడర్ గా స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాధ్యతలను తీసుకుంది. ఓ గొప్ప బాధ్యతతో తెలుగు వారికి మరింత దగ్గరవనుంది ఈ అమ్మడు. తెలుగులో స్టార్ హీరోయిన్ గా క్రేజ్ తెచ్చుకున్న రకుల్ ఓ పక్క అవసరమైన సందర్భంలో తన సహ్రుదయాన్ని చాటుకుంటుంది.

ఇక కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన భేటీ బచావో.. భేటీ పడావో కార్యక్రమానికి తెలంగాణా రాష్ట్రం తరపునుండి రకుల్ ఎంపికవడం విశేషం. ఇప్పటికే తెలుగులో వరుస సినిమాలు చేస్తున్న అమ్మడు హైదరాబాద్ లో సొంత ఇళ్లు కొనుక్కుంది. ఇక్కడ స్టార్ గా అవరించడమే కాదు ఇక్కడ బాధ్యతలను తీసుకుంటున్న రకుల్ ఇక్కడే సెటిల్ అయ్యే ఆలోచనలో ఉందని చెప్పొచ్చు.