పూరి మొదలు పెట్టేశాడు..!

డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ పూరి జగన్నాథ్ డైరక్షన్ లో పూరి తనయుడు ఆకాష్ హీరోగా వస్తున్న సినిమా మెహబూబా. పైసా వసూల్తో నిరాశ పరచిన పూరి కొడుకుతో సినిమా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. 15 రోజుల్లో స్క్రిప్ట్ పూర్తి చేసిన పూరి మెహబూబా సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లాడు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్ మీద ఈ సినిమా దర్శక నిర్మాతగా పూరి సినిమా మొదలుపెట్టాడు.

ఆకాష్ తో పాటుగా నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా 1970 లో జరిగిన ఇండో పాక్ యుద్ధం సమయంలో ప్రేమకథగా రాబోతుందట. టైటిల్ పోస్టర్ తో ట్రెండ్ సృష్టించిన పూరి కొడుకుతో ట్రాక్ ఎక్కేలానే ఉన్నాడు. పూరి టేకింగ్ లో తనయుడు ఎలా ఉండబోతున్నాడు అన్నది చూడాలి. ఈ సినిమాతో సత్తా చాటుకుని మళ్లీ స్టార్స్ కు కథ వినిపించాలనే ఆలోచనలో ఉన్నాడు పూరి.