
కోలీవుడ్ లో సూపర్ కాంబో జయం రవి, అరవింద్ స్వామి కలిసి నటించిన తని ఒరువన్ సినిమా అక్కడ హిట్ అవడంతో అదే సినిమా తెలుగులో చరణ్ ధ్రువగా తీసి ఇక్కడ హిట్ అందుకున్నాడు. కోలీవుడ్ లో మరోసారి ఆ ఇద్దరు కలిసి బోగన్ సినిమా తీశారు. ఫలితం ఎలా ఉన్నా సినిమాకు పెట్టిన ఖర్చు రాబట్టేసింది ఆ సినిమా. ఇక ఇప్పుడు ఆ సినిమాను కూడా తెలుగులో రీమేక్ చేయబోతున్నారట.
రవితేజ హీరోగా రాబోతున్న బోగన్ రీమేక్ లో అసలైతే కేథరిన్ త్రెసా హీరోయిన్ గా నటిస్తుందని అన్నారు. కాని ఏమైందో ఏమో ఆ ప్రాజెక్ట్ నుండి కేథరిన్ ను తప్పించి కాజల్ కు ఛాన్స్ ఇస్తున్నారట. కెరియర్ సర్ధేయడమే అనుకున్న టైంలో క్రేజీ ఆఫర్లు వచ్చి కాజల్ ను మళ్లీ టాప్ ప్లేస్ లో నిలబెట్టాయి. ఖైది నెంబర్ 150, నేనే రాజు నేనే మంత్రి సినిమాల ఫలితాలు అమ్మడికి మంచి క్రేజ్ తీసుకు రాగా ఆ సినిమాల ఫలితాలతో వరుస సినిమాల అవకాశాలను అందుకుంటుంది.