వర్మ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మిపార్వతి ఎవరు..?

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ మొదలుపెట్టిన లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ సినిమాలో లక్ష్మిపార్వతిగా వైసిపి ఎమ్మెల్యే రోజా నటిస్తున్నారని తెలుస్తుంది. ఈ సినిమాకు నిర్మాతగా వైసిపికి చెందిన రాకేష్ రెడ్డి వ్యవహిస్తున్నారు. ఫస్ట్ లుక్ పోస్టర్ తోనే వివాదాలు సృష్టించిన వర్మ సినిమాలో లక్ష్మి పార్వతిగా రోజాను పెట్టుకుని మరింత వివాదానికి ఉసిగొల్పుతున్నాడు.

ఇక సినిమాలో ఎన్.టి.ఆర్ గా ప్రకాశ్ రాజ్ నటిస్తున్నాడని వార్తలు రాగా వాటిలో ఏమాత్రం నిజం లేదని కొట్టి పారేశారు. మరి టిడిపి అంటే అంతెత్తున లేచే రోజా ఎన్.టి.ఆర్ జీవితానికి సంబందించిన సినిమాల్లో నటించి ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సినిమా మేకింగ్ పట్ల బెదిరింపులు వచ్చినా సరే బెదిరేది లేదని అంటున్నాడు వర్మ.