ఎన్టీఆర్ త్రివిక్రం టైటిల్ ఇదేనా..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ త్రివిక్రం కాంబినేషన్ లో మూవీ వచ్చే ఏడాది మార్చి నుండి సెట్స్ మీద వెళ్లబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం త్రివిక్రం పవర్ స్టార్ సినిమా పూర్తి చేసి కొద్దిపాటి గ్యాప్ తో ఆ సినిమా చేయబోతున్నాడు. జై లవ కుశ హిట్ క్రేజ్ మీదున్న ఎన్.టి.ఆర్ ఈ సినిమాలో ఆర్మీ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. 

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో కె.రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తుండగా సినిమాలో హీరోయిన్ గా అను ఇమ్మాన్యుయెల్ హీరోయిన్ గా నటిస్తుందట. ఇక ఈ సినిమాకు టైటిల్ గా సోల్జర్ అని పెట్టబోతున్నారట. సినిమాలో తారక్ లుక్ కొత్తగా ఉండబోతుందని తెలుస్తుంది. కచ్చితంగా సినిమా అంచనాలను అందుకునేలా ఉంటుందట. ఇప్పటిదాకా పవన్, మహేష్, అల్లు అర్జున్, నితిన్ లతో సినిమా చేసిన త్రివిక్రం కెరియర్ లో మొదటిసారి ఎన్.టి.ఆర్ తో చేయబోతున్నాడు మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.