సమంతను రీప్లేస్ చేస్తున్న భామ..!

టాలీవుడ్ లో కొంతకాలంగా సమంత జోరు కొనసాగించిందని చెప్పాలి. ఏమాయ చేసావే సినిమా నుండి రాబోతున్న రాజు గారి గది-2 వరకు సమంత తన అందం అభినయంతో ఆకట్టుకోగా ఇప్పుడు ఆమె నాగ చైతన్యతో పెళ్లి చేసుకుంది కాబట్టి ఆమె ప్లేస్ లో ఓ మలయాళ భామ ఈ అవకాశాలను అందుకుంటుంది. సమంత రేంజ్ అందుకోవడం కష్టమే అయినా సమంత ఛాన్సెస్ అన్నిటిని కొట్టేస్తుంది అను ఇమ్మాన్యుయెల్.

నాని మజ్ఞు సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ఆ తర్వాత రాజ్ తరుణ్ తో చేసిన కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాతో కూడా పర్వాలేదు అనిపించుకుంది. ఆ రెండు సినిమాలతోనే పవర్ స్టార్ త్రివిక్రం ఛాన్స్ తో పాటుగా, స్టైలిష్ స్టార్ నా పేరు సూర్య అవకాశాన్ని అందుకున్న అను రాబోయే రోజుల్లో స్టార్ హీరోయిన్ అయ్యే లక్షణాలు కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. మరి స్టార్స్ తో చేస్తున్న సినిమాలు హిట్ అయితే మాత్రం అను ఇమ్మాన్యుయెల్ టాలీవుడ్ కెరియర్ కు తిరుగులేదని చెప్పొచ్చు.