
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న 102వ సినిమా టైటిల్ గా కర్ణ అని పెట్టబోతున్నారట. కె.ఎస్ రవికుమార్ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాను సి.కళ్యాణ్ నిర్మిస్తున్నారు. నయనతార హీరోయిన్ గా నటిస్తుండగా బాలయ్య మార్క్ సెంటిమెంట్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా సినిమా ఉండబోతుందట. సినిమా ముహుర్తం నాడే బాలయ్య లుక్ కొత్తగా అనిపించింది.
ఇక ఈ సినిమాకు టైటిల్ గా కర్ణ అని పెట్టబోతున్నారట. అయితే కర్ణ ఇప్పటికే రిజిస్టర్ అయ్యి ఉండటంతో ఎన్.బి.కె కర్ణ అని ఈ సినిమాకు పెట్టబోతున్నారట. శాతకర్ణి తర్వాత మరింత ఉత్సాహం పెంచుకున్న బాలయ్య పైసా వసూల్ తో నిరాశ పరచినా కచ్చితంగా ఈ కర్ణ సినిమాతో మాత్రం అలరిస్తాడని అంటున్నారు. సింహా, శ్రీరామరాజ్యం సినిమాల తర్వాత నయనతారతో బాలయ్య చేస్తున్న సినిమా ఇదే కావడం విశేషం.