శ్రియతో జోడికట్టనున్న గౌతమీపుత్ర శాతకర్ణీ

డిక్టేటర్ తో 99 సినిమాలు పూర్తిచేసుకున్న నందమూరి నటసింహం బాలకృష్ణ నటిస్తున్న 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణీ. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రం చారిత్రాత్మక కథాంశంతో రూపొందుతోంది. ఈ చిత్రాన్ని ఫ‌స్ట్ ఫ్రేమ్ ఎంట‌ర్ టైన్మెంట్స్ బ్యాన‌ర్ పై బిబో శ్రీనివాస‌రావు స‌మ‌ర్పణ‌లో వై.రాజీవ్ రెడ్డి, జాగ‌ర్లమూడి సాయిబాబు సంయుక్తంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చిలుకురి బాలాజీ టెంపుల్ సమీపంలో వేసిన ఓ భారీ సెట్ లో జరుగుతోంది. దాదాపు వెయ్యి మంది జూనియర్ ఆర్టిస్టులతో, 200 పడవలను వినియోగిస్తూ షూటింగ్ చేస్తున్నారు. ఇంట్రవెల్ కు ముందు వచ్చే సీన్ కోసం ఈ సముద్ర యుద్ధ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇదిలా వుంటే ఈ ప్రతిష్టాత్మక సినిమాలో హీరోయిన్ గా ఇంకా ఎవరూ ఫైనలైజ్ అవ్వలేదు. చాలామంది హీరోయిన్లను పరిశీలించినప్పటికీ.. చివరకు శ్రియను ఖరారు చేసినట్లుగా తెలిసింది. ఇలాంటి చారిత్రాత్మక సినిమాల్లోని పాత్రకు శ్రియ అయితేనే సరిగ్గా సరిపోతుందనే భావనతో తనను ఎంపిక చేసినట్లుగా సమాచారం. గతంలో బాలకృష్ణ-శ్రియ కాంబినేషన్లో చెన్నకేశవరెడ్డి సినిమా రూపొందింది. చాలా కాలం తర్వాత మళ్లీ వీరి కాంబినేషన్ రిపీట్ కానుంది.

విజువల్ వండర్ గా భారీ గ్రాఫిక్స్ తో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు టీజర్ ను బాలకృష్ణ పుట్టినరోజున(జూన్ 10) విడుదల చేయనున్నారు. అలాగే అదే రోజున హీరోయిన్ శ్రియ అనే విషయం అధికారికంగా ప్రకటించనున్నారు.