లావణ్య తగ్గక తప్పలేదు..!

అందాల రాక్షసి సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన లావణ్య త్రిపాఠి తన క్యూట్ లుక్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంది. ఇక కెరియర్ లో సినిమాలైతే చేస్తుంది కాని అమ్మడికి హిట్ సినిమాలే కరువయ్యాయి. లాస్ట్ ఇయర్ శ్రీరస్తు శుభమస్తు సినిమా హిట్ కొట్టినా ఈ ఇయర్ వచ్చిన రాధ, యుద్ధం శరణం సినిమాలు నిరాశ పరచాయి. ఈ క్రమంలో అమ్మడు ప్రస్తుతం చేయబోయే సినిమాలకు రెమ్యునరేషన్ తగ్గించేసిందట.

ప్రస్తుతం రామ్ తో ఉన్నది ఒక్కటే జిందగి సినిమాలో నటిస్తున్న లావణ్య త్రిపాఠి మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ వినాయక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కూడా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కోసం అమ్మడు రెమ్యునరేషన్ తగ్గించుకుందట. క్రేజ్ మీద ఉన్నప్పుడు 70 లక్షల దాకా తీసుకున్న లావణ్య ఇప్పుడు 50 లక్షలు ఇచ్చినా సినిమా చేస్తుందట. మొత్తానికి లావణ్య సినిమా కోసం తగ్గక తప్పలేదన్నమాట. ఇప్పుడు తగ్గినా సరే అమ్మడు వరుసగా హిట్లు కొడితే మళ్లీ పెంచేస్తుందని చెప్పొచ్చు.