
అక్కినేని నాగ చైతన్య సమంత పెళ్లిలో దగ్గుబాటి వారి హంగామా అంతా ఇంతా కాదు. నాగ చైతన్య స్వయాన మేనళ్లుడు కావడం చేత సంగీత్ లో విక్టరీ వెంకటేష్ ఆట పాటలతో అదరగొట్టాడని తెలుస్తుండగా బడా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు సమంతతో డ్యాన్స్ చేసిన ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఎప్పుడు చాలా రిజర్వెడ్ గా కనిపించే సురేష్ బాబు ఈ రేంజ్ లో రెచ్చిపోవడం ఎవరు చూసి ఉండరు.
మేనళ్లుడు నాగ చైతన్య పెళ్లిలో మేనమామల హంగామా లేకపోతే ఎలా అనుకున్నారో ఏమో వేడుకలో అంతా దగ్గుబాటి సోదరుల గురించే మాట్లాడుకునేలా చేశారట. ఇక కింగ్ నాగార్జున కూడా డ్యాన్సులతో ఊపేశాడని అంటున్నారు. మొత్తానికి ఫ్యామిలీ సభ్యులు కొంతమంది సిని సెలబ్రిటీల మధ్య పెళ్లితో ఒకటయ్యారు నాగ చైతన్య, సమంత. నిన్న హిందు సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్న వీరు ఈరోజు క్రిస్టియన్ సంప్రదాయంలో రెండోసారి పెళ్లిచేసుకోనున్నారు.