'భరత్ అను నేను' మహేష్ బయటపడ్డాడు..!

మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా భరత్ అను నేను. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ భామ కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. సినిమాలో మహేష్ ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడు. ప్రస్తుతం మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు చిన్న బ్రేక్ ఇచ్చాడు మహేష్. అయితే ఈలోగా ఎలా లీక్ అయ్యిందో ఏమో కాని భరత్ అను నేనులో మహేష్ లుక్ లీక్ అయ్యింది.

సిఎం లుక్ కొత్తగా ఏం లేదు కాని ముందు సెక్యురిటీ పక్కన పిఏలతో మహేష్ లుక్ అదిరిపోయింది. ఈ లుక్ రివీల్ విషయంలో సినిమా దర్శకుడు కొరటాల శివ కోపంగా ఉన్నాడట. దయచేసి సినిమాను లీకు బారిన పడేయకండని అంటున్నాడు. సినిమా నుండి ఫోటో మాత్రమే లీక్ అయ్యింది కాబట్టి పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు కాని ఇక ఈ లీకులపై చిత్రయూనిట్ దృష్టి పెట్టి కఠిన నిర్ణయాలు తీసుకుంటే మంచిది.