
సూపర్ స్టార్ రజినికాంత్ క్రేజీ డైరక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.0. రోబో సీక్వల్ గా వస్తున్న ఈ సినిమా త్రిడి టెక్నాలజీతో తెరకెక్కించబడుతుంది. 400 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా మేకింగ్ వీడియో కొద్దినిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా ఎలా ఉండబోతుంది అంటూ విజువల్ గా చూపించేస్తూ రిలీజ్ చేసిన ఈ మేకింగ్ వీడియో అదిరిపోయింది,
హాలీవుడ్ సినిమాలకు ఏమాత్రం తీసిపోని విధంగా 2.0 రాబోతుంది. ఇండియన్ సినిమాను మరో లెవల్ కు తీసుకెళ్లేలా ఈ సినిమా తీస్తున్నాడు. 2.0 ఒక సినిమా కాదు ఓ ఎక్స్ పీరియెన్స్ అంటున్నాడు శంకర్. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తుంది. సినిమా మేకింగ్ వీడియోతోనే వారెవా అనిపించిన శంకర్ సినిమాను ఏ రేంజ్ లో తెరకెక్కించాడో అర్ధం చేసుకోవచ్చు.