
కొన్నాళ్లుగా ప్రేమించుకుంటున్న నాగ చైతన్య, సమంతలు మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. నిన్న హిందు సాంప్రదాయం ప్రకారం చైతు, సమంత పెళ్లి జరుగగా ఈరోజు క్రిస్టియన్ సంప్రదాయ పద్ధతుల్లో పెళ్లి జరుగనుందట. ఒకేసారి రెండు సార్లు పెళ్లిచేసుకుంటూ చైతన్య, సమంత కొత్త పద్ధతికి నాంధి పలికారు. ప్రేమను గౌరవిస్తూ రెండు పద్ధతుల్లో పెళ్లిచేసుకుంటున్న వీరి మధ్య అండర్ స్టాండింగ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ పెళ్లి వేడుకకు కేవలం అతి తక్కువమందినే పిలిచారట. అయితే హైదరాబాద్ లో రిసెప్షన్ ను మాత్రం భారీగా ప్లాన్ చేశారని తెలుస్తుంది. టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఈ రిసెప్షన్ కు వచ్చేలా ప్లాన్ చేశారట. పొలిటికల్ లీడర్స్ కు నాగార్జున ఆహ్వాన పత్రికలు అందించారట. మొత్తానికి నాగ చైతన్య, సమంత అనుకున్నది సాధించారు. వీరిద్దరి మధ్య ప్రేమ కళకాలం ఇలానే ఉండాలని ఆశిద్దాం.