బిగ్ బాస్-2 ఎన్.టి.ఆరే..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హోస్ట్ గా స్టార్ మాలో వచ్చిన రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ వన్ అనుకున్న దానికంటే ఎక్కువే సక్సెస్ అయ్యింది. బుల్లితెర ఆడియెన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నంలో తారక్ చేసిన ఈ మొదటి ప్రయత్నం సూపర్ సక్సెస్ అవగా ఇక బిగ్ బాస్ రెండో సీజన్ హోస్ట్ గా తారక్ ఉండట్లేదని.. సీజన్-2 లో ఎన్.టి.ఆర్ బదులు నాని వస్తాడని అన్నారు.

కాని అందులో ఏమాత్రం నిజం లేదట.. బిగ్ బాస్ వల్ల జై లవ కుశకు మంచే జరిగింది. అందుకే తారక్ బిగ్ బాస్ సీజన్-2కు కంటిన్యూ అయ్యేలా చర్చలు జరుపుతున్నాడట. సీజన్ వన్ సక్సెస్ చేసిన తారక్ ఇప్పుడు సీజన్ 2కు తానే తొందరపడుతున్నాడని తెలుస్తుంది. త్రివిక్రం సినిమా ఎలాగు మార్చి దాకా మొదలు పెట్టే పరిస్థితి కనబడటం లేదు అందుకే ఈ గ్యాప్ లో బిగ్ బాస్ సీజన్-2 స్టార్ట్ చేసి ఫ్యాన్స్ ను అలరించాలని చూస్తున్నాడు తారక్.