సైరాకు మొదట్లోనే సమస్యలా..!

మెగాస్టార్ చిరంజీవి తన 151వ సినిమాగా ఎనౌన్స్ చేసిన సైరా నరసింహారెడ్డి సినిమాకు చిక్కు ముళ్లుగా కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లో రాం చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో తెరకెక్కనుంది. సెట్స్ మీదకు వెళ్లడానికి ముందే ఈ సినిమాపై ఓ రకమైన నెగటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుంది.

ముఖ్యంగా సినిమా క్రూ విషయంలో ఏర్పడ్డ గందరగోళం అంతా ఇంతా కాదు. చిరు పుట్టినరోజు నాడు అట్టహాసంగా సినిమా కాస్ట్ అండ్ క్రూని పరిచయం చేసిన చిత్రయూనిట్ వారిని కొనసాగించే క్రమంలో కొన్ని మార్పులు చేస్తుందట. సినిమాకు మ్యూజిక్ డైరక్టర్ గా రెహమాన్ ను అనుకోగా రెహమాన్ కు డైరక్టర్ సూరికి ఎక్కడ పొంతన కుదరట్లేదని టాక్. తనకు నచ్చిన థమన్ కాకుండా రెహమాన్ ఈ ప్రాజెక్ట్ లో భాగమైనందుకు సురేందర్ రెడ్డి అసంతృప్తితో ఉన్నాడట. అందుకే రెహమాన్ ఈ సినిమా నుండి బయటకు వచ్చేద్దామనే ఆలోచనలో ఉన్నాడట. 

ఇక సినిమాటోగ్రాఫర్ రవివర్మన్ కూడా సైరాకు గుడ్ బై చెప్పాడని టాక్. అతని ప్లేస్ లో రత్నవేలుని తీసుకోబోతున్నారట. అయితే ఈ వార్తలు బయట హడావిడి చేస్తున్న చిత్రయూనిట్ మాత్రం ఈ విషయాల మీద రెస్పాండ్ అవకపోవడం విశేషం.