
డేరింగ్ అండ్ డ్యాషింగ్ డైరక్టర్ గా క్రేజ్ తెచ్చుకున్న పూరికి ప్రస్తుతం టైం ఏమాత్రం కలిసి రావట్లేదు. జ్యోతి లక్ష్మి నుండి రీసెంట్ గా వచ్చిన పైసా వసూల్ దాకా ప్రీ రిలీజ్ హంగామా అదరగొట్టడం రిలీజ్ తర్వాత సినిమా తుస్సుమనిపించడం చూస్తూనే ఉన్నాం. బాలయ్య కోరి మరి ఇచ్చిన అవకాశాన్ని సరిగా వాడుకోలేని పూరి తన తర్వాత సినిమా కొడుకుతో మొదలు పెట్టాడు. ఇండో పాక్ యుద్ధం సమయంలో నడిచే ప్రేమకథ నేపథ్యంలో మెహబూబా సినిమా మొదలుపెట్టాడు పూరి.
ఇక ఈ సినిమా తర్వాత ఎవరు ఊహించని విధంగా హీరో టర్నెడ్ కమెడియన్ సునీల్ తో పూరి సినిమా ఉంటుందని తెలుస్తుంది. కమెడియన్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సునీల్ హీరోగా స్టార్టింగ్ లో హిట్లు అందుకున్నా ప్రస్తుతం సునీల్ పరిస్థితి కూడా దారుణంగా మారింది. అందుకే క్రేజీ కాంబో సెట్ చేసే పనిలో పూరితో చేతులు కలుపుతున్నాడట. సునీల్ లాంటి కమెడియన్ తో పూరి ఎలాంటి సినిమా చేస్తాడు అన్నది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయ్యింది. పూరి సొంత నిర్మాణంలోనే ఈ సినిమా చేస్తాడని టాక్. మరి ఈ ప్రాజెక్ట్ పై మరిన్ని డీటేల్స్ త్వరలో వెళ్లడవుతాయి.