వరుణ్ తేజ్ తో ఘాజి డైరక్టర్..!

మెగా బ్రదర్ నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ ముకుందతో తన సిని ప్రయాణం మొదలుపెట్టగా రీసెంట్ గా వచ్చిన ఫిదాతోనే సూపర్ హిట్ అందుకున్నాడు. ఇక ఆ సినిమా హిట్ ఇచ్చిన బాధ్యతతో చేయబోతున్న సినిమాల పట్ల కూడా ఎంతో జాగ్రత్త తీసుకుంటున్నాడు వరుణ్ తేజ్. ప్రస్తుతం వెంకీ అట్లూరి డైరక్షన్ లో సినిమా చేస్తున్న వరుణ్ తేజ్ తన తర్వాత సినిమా ఘాజి డైరక్టర్ సంకల్ప్ రెడ్డితో ఫిక్స్ అయ్యాడట.

ఘాజి సినిమాతో దర్శకుడిగా తన సత్తా చాటి లిమిటెడ్ బడ్జెట్ లో మంచి స్టోరీ టెల్లర్ అనిపించుకున్న సంకల్ప్ రెడ్డి వరుణ్ తేజ్ తో సినిమా చేయబోతున్నాడట. ఈ సినిమా కూడా కొత్త కాన్సెప్ట్ తో ఉంటుందని తెలుస్తుంది. మరి రాబోతున్న ఈ సినిమా వరుణ్ తేజ్ కు ఎలాంటి హిట్ ఇస్తుందో చూడాలి. కెరియర్ లో మొదటి సక్సెస్ మజా ఏంటో రుచి చూసిన వరుణ్ తేజ్ కెరియర్ అలాంటి సక్సెస్ బాటలో వెళ్లే ప్రయత్నాలు చేస్తున్నాడు.