
టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల్ స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ పెళ్లిపై రోజుకో ట్విస్ట్ అందరికి తెలిసిందే. బాహుబలి క్రేజ్ తో నేషనల్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పరచుకోగా ఇప్పుడు దేశం మొత్తం ప్రభాస్ పెళ్లి గురించి వెయిట్ చేస్తుంది. ఇక లేటెస్ట్ గా ప్రభాస్ పెళ్లి చేసుఓబోయేది స్వీటీ అనుష్కనే అంటూ యూ.ఏ.ఈ సిని క్రిటిక్ సంచలన ట్వీట్ చేశాడు.
సాధారణంగా సినిమాలకు అందరి కన్నా ముందే రివ్యూ పంపించే ఉమర్ సంధు ఈసారి తన ఫోకస్ ప్రభాస్ పెళ్లి మీద పెట్టాడు. ప్రభాస్ అనుష్కలు డీప్ లవ్ లో ఉన్నారని వారిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని సర్ ప్రైజ్ ట్వీట్ చేశాడు ఉమర్ సంధు. ఈ విషయంపై ప్రభాస్ ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు కాని ప్రభాస్ అనుష్క ల మధ్య ఎఫైర్ నడుస్తుంది అన్న వార్తలకు ఈ న్యూస్ బలం చేకూరేలా చేసింది. మరి అటు ప్రభాస్, ఇటు అనుష్క ఈ విషయంపై ఎలా రెస్పాండ్ అవుతారు అన్నది వేచి చూడాలి.