శివ బాలాజి మనసులు గెలిచాడు..!

స్టార్ మాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన బిగ్ బాస్ తెలుగు కార్యక్రమంలో విజేతగా నిలిచాడు శివ బాలాజి. ఇంటి సభ్యులకు వంటా వార్పు అందిస్తూ తను ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. ఫైనల్ గా బిగ్ బాస్ సీజన్ వన్ విన్నర్ అయిన శివ బాలాజి అందుకు గాను 50 లక్షలు ట్యాక్స్ కటింగ్స్ పోనూ 35 లక్షల దాకా గెలుచుకున్నాడట.

ఇక దీని కోసం 70 రోజులు కష్టపడిన శివ బాలాజి ఆ మొత్తాన్ని ఓ అనాధ ఆశ్రమానికి విరాళంగా ఇచ్చేశాడట. తను ఆ ఎమౌంట్ ఇచ్చిన విషయాన్ని గోప్యంగా ఉంచడానికి ప్రయత్నించాడట కాని ఎలాగోలా ఆ విషయం బయటకు పొక్కింది. 70 రోజులు కుటుంబ సభ్యులకు దూరంగా ఉండి గెలుచుకున్న మొత్తాన్ని అనాధ పిల్లల కోసం విరాళం అందించిన శివ బాలాజి నిజంగా గొప్ప మనసు కలవాడని చెప్పొచ్చు. పావలా సాయం చేస్తేనే డబ్బా వేసుకుని మరి చాటింపేస్తున్న ఈరోజుల్లో ఇంత పెద్ద మొత్తం విరాళంగా ఇచ్చిన శివ బాలాజి గురించి ఎక్కడ ఏ వార్త రాకుండా చూసుకోవడం విశేషం. ఇక ఈ విషయానికి సంబందించిన మిగతా వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.