పవర్ స్టార్ కు నో చెప్పిన సింగర్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాలో ఛాన్స్ వస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది ఒక్కసారిగా ఎగిరి గంతేసే ఆనందం వస్తుంది. కాని సింగర్ గా ఉన్న ఓ అమ్మడికి పవన్ కళ్యాణ్ సినిమాలో మెరిసే అవకాశం వచ్చినా సారీ అనేసిందట. ఇంతకీ ఎవరా సింగర్ అంటే పర్ణిక అని తెలుస్తుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాలో నటించే ఛాన్స్ వచ్చినా తాను ఆ ఆఫర్ కాదన్నదట.

సినిమాలో నటిస్తే అది ప్రాధాన్యత ఉన్న పాత్రలో చేస్తానని.. ఎక్స్ పోజింగ్ కు మాత్రం తాను విరుద్ధం అని అంటుంది అమ్మడు. అసభ్యకరంగా కనిపించే పాత్రలు తాను చేయబోనని అందుకే చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చినా ఇప్పటిదాకా దేనికి ఓకే చెప్పలేదు అంటుంది పర్ణిక. మరి పెళ్లి తర్వాత అమ్మడికి అక్క వదిన పాత్రలు కాకుండా ఇంకా ఏం అవకాశాలు వస్తాయనుకుంటుందో కాని పర్ణిక కోసం దర్శక నిర్మాతలు అడిగితే మాత్రం అమ్మడి చెబుతున్న కబుర్లు ఇవే. మరి ఆమె మనసుకి నచ్చే పాత్ర ఏ దర్శకుడు ఇస్తాడో చూడాలి.