
ఇటీవల రిలీజ్ అయ్యి పెను సంచలనం సృష్టించిన అర్జున్ రెడ్డి సినిమా రీమేక్ లో కూడా హంగామా చేస్తుంది. విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ వంగ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఈ ఇయర్ సూపర్ హిట్ లిస్ట్ లో చేరింది. ఇక ఈ సినిమా తమిళ రీమేక్ రైట్స్ ధనుష్ అందుకోగా అందులో హీరోగా మాత్రం చియాన్ విక్రం తనయుడు ధ్రువ్ నటిస్తున్నాడని తెలుస్తుంది.
విక్రం తనయుడిగా ధువ్ తెరంగేట్రం చేయబోయే మొదటి సినిమా ఇది. తెలుగులో విజయ్ దేవరకొండ నటనకు ఇక్కడ యూత్ అంతా అతనికి ఫ్యాన్స్ అయ్యారు. ఇప్పుడు అదే సినిమా ధ్రువ్ అక్కడ నటిస్తున్నాడు. విక్రం లానే డిఫరెంట్ సినిమాలు తీయాలన్న ధ్రువ్ ఆలోచన గొప్పదే.. అందుకే అర్జున్ రెడ్డి లాంటి అదరగొట్టే సినిమాను డెబ్యూ మూవీగా ఎంపిక చేసుకున్నాడు.