ఆ సినిమాకు ముహుర్తం పెట్టేసిన బన్ని..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా కోలీవుడ్ డైరక్టర్ లింగుస్వామి డైరక్షన్ లో ఓ సినిమా ఎనౌన్స్ చేశారు. ఎన్నాళ్లనుండో అనుకుంటున్న ఈ సినిమాకు ఎట్టకేలకు ముహుర్తం కుదిరేసిందట. ఈ సినిమా వచ్చే మార్చి నెలలో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చూస్తున్నారట. తెలుగు తమిళ భాషల్లో బైలింగ్వల్ గా ఈ సినిమా రాబోతుందట.

ప్రస్తుతం బన్ని వక్కంతం వంశీ డైరక్షన్ లో నా పేరు సూర్య సినిమా చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి కాగానే లింగుస్వామి సినిమా ఉంటుందని తెలుస్తుంది. కోలీవుడ్ నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ ఈ సినిమాను నిర్మిస్తారని తెలుస్తుంది. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి తెరకెక్కనున్న ఈ సినిమాలో హీరోయిన్ మిగతా కాస్ట్ అండ్ క్రూ ఎవరన్నది త్వరలో తెలుస్తాయట.