
ఉయ్యాలవాడ నరసింహారెడ్డి బయోపిక్ గా వస్తున్న సైరా నరసింహారెడ్డి సినిమా సురేందర్ రెడ్డి డైరక్షన్ లో వస్తున్న సంగతి తెలిసిందే. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్లో వస్తున్న ఈ సినిమా నిర్మాణ బాధ్యతల నుండి రాం చరణ్ తప్పుకుంటున్నాడట. ఇక నుండి తన బదులు ఉపాసన ఆ విషయాలను చూసుకుంటుందట. సెట్స్ లోకి వెళ్లదు అన్నమాటే కాని ఇప్పటికి బడ్జెట్ విషయంలో చరణ్ కు సలహా ఇస్తున్న ఉపాసన ఇక నుండి డైరెక్ట్ గా రంగంలో దిగుతుందట.
సుకుమార్ కాంబినేషన్ లో చేస్తున్న రంగస్థలం 1985 మూవీ పెండింగ్ పడుతున్న నేపథ్యంలో చరణ్ ఈ సినిమా బాధ్యతల నుండి తప్పుకుంటున్నాడట. టైటిల్ కార్డ్ లో ఎలాగు చిరంజీవి సతీమణి సురేఖా అని వేస్తారు. కాని షూటింగ్ టైంలోనే నిర్మాతగా మాత్రం ఉపాసన ఉంటుందట. మరి ఉపాసన నిర్మాణ బాధ్యతలను ఎలా చూసుకుంటుందో చూడాలి.