
యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జై లవ కుశ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్ పెట్టారు తెలంగాణా రాష్ట్ర మంత్రి కె. తారక రామారావు. దసరా సందర్భంగా కె.టి.ఆర్ పెట్టిన ట్వీట్ గురించి ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. ఓ నెటిజెన్ కె.టి.ఆర్ ను ఇరకాటంలో పెట్టాలనే ఉద్దేశంతో కె.టి.ఆర్ గారు జాగ్రత్త జై (ఎన్.టి.ఆర్) వచ్చేస్తున్నాడు అని ట్వీట్ చేయగా దానికి బదులుగా కె.టి.ఆర్ కూడా ఎంతో చాకచక్యంగా రిప్లై ఇచ్చారు.
ఇబ్బంది ఏమి లేదు మిత్రమా.. పర్సనల్ గా ఎన్.టి.ఆర్ నాకు మంచి మిత్రుడు అంతేకాదు ఎన్.టి.ఆర్ కు జై ని జాగ్రత్తగా చూసుకోవడం తెలుసని ట్వీట్ చేశాడు. ఇక్కడ రాజకీయంగా వచ్చిన ప్రస్థావనగా అనిపించినా కె.టి.ఆర్ తన తెలివితేటలతో జై లవ కుశలోని సినిమా పాత్రని చెబుతూ ఆన్సర్ ఇచ్చారు. మొత్తానికి కె.టి.ఆర్ ఇచ్చిన ఆన్సర్ కు నెటిజెన్ కూడా షాక్ అయ్యాడని అంటున్నారు.