కాంపిటీషన్ లో హిట్ కొడుతున్న హీరో..!

తెలుగులో ఉన్న విలక్షణ హీరోల్లో శర్వానంద్ ఒకరు. సినిమాలో ఎలాంటి పాత్రనైనా అలవోకగా చేసే శర్వానంద్ కాపిటీషన్ లో సినిమా రిలీజ్ చేస్తూ సక్సెస్ మజాని ఎంజాయ్ చేస్తున్నాడు. సంక్రాంతి రారాజుగా పేరు సంపాదించిన శర్వానంద్ ఇప్పుడు దసరాకి తన విజయాన్ని నమోదు చేసుకున్నాడు. నిన్న రిలీజ్ అయిన మహానుభావుడు అన్నిచోట్ల పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.

జై లవ కుశ, స్పైడర్ లాంటి రెండు పెద్ద సినిమాల మధ్య వచ్చిన శర్వానంద్ మహానుభావుడు హిట్ టాక్ తెచ్చుకున్నాడు. ఇదో రకంగా శర్వానంద్ ఎనర్జీని తెలియచేస్తున్నా మనవాడికి పండుగ బాగా కలిసి వచ్చిందని అంటున్నారు. ఈ ఇయర్ శతమానం భవతి సినిమా హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత రాధతో నిరాశ పరచినా ఈ మహానుభావుడితో హిట్ కొట్టాడు. సోలోగా వస్తే కన్నా కాంపిటీషన్ లో శర్వా హిట్ అందుకోవడం అందరిని షాక్ అయ్యేలా చేస్తుంది. మారుతి డైరక్షన్ లో వచ్చిన మహానుభావుడు సినిమా యువి క్రియేషన్స్ బ్యానర్లో నిర్మించగా మెహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటించింది.