భారతీయుడు సీక్వల్ నిర్మాత దిల్ రాజు..?

డిస్ట్రిబ్యూటర్ గా, నిర్మాతగా సక్సెస్ ఫుల్ సినిమాలను తీస్తూ వస్తున్న దిల్ రాజు కెరియర్ లో ఓ బడా బడ్జెట్ మూవీకి ప్లాన్ చేస్తున్నాడట. అది కూడా తెలుగు సీక్వల్ సినిమా కాకుండా ఓ కోలీవుడ్ భారీ హిట్ సినిమా సీక్వల్ కు శ్రీకారం చుడుతున్నాడట. సౌత్ లో క్రేజీ డైరక్టర్స్ పేర్లలో ముందు వరుసలో ఉండే శంకర్ యూనివర్సల్ స్టార్, లోకనాయకుడు కమల్ హాసన్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా భారతీయుడు.

ఈ సినిమా సీక్వల్ ప్రయత్నాల్లో ఉన్నారని.. తప్పకుండా భారతీయుడు సీక్వల్ సినిమా ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే శంకర్ దీనికి సంబందించిన లైన్ ఒకటి రాసుకున్నారట. ఇక దీనికి నిర్మాతగా టాలీవుడ్ క్రేజీ ప్రొడ్యూసర్ దిల్ రాజు ఉంటారని తెలుస్తుంది. ఇదే నిజం అయితే దిల్ రాజు నిర్మాణంలో వచ్చే ప్రెస్టిజియస్ బడ్జెట్ మూవీ ఇదే అయ్యే అవకాశాలున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ కూడా ఇండియన్-2 అని పెట్టబోతున్నారట. మరి దిల్ రాజు నిర్మాణంలో ఇండియన్-2 సినిమా ఎంతవరకు నిజం అన్నది తెలియాల్సి ఉంది.