
మలయాళ ప్రేమంతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న సాయి పల్లవి తెలుగులో చేసిన మొదటి సినిమా ఫిదా. ఇక ఆ సినిమా హిట్ తో అమ్మడి ఇమేజ్ గ్రాఫ్ అలా పెరిగిపోయింది. ప్రేమం తోనే ప్రేక్షకుల మనసులు గెలిచిన సాయి పల్లవి ఫిదాతో అది రెట్టింపు అయ్యేలా చేసుకుంది. ఇక ఫిదా భామ మరో లక్కీ ఛాన్స్ అందుకుంది.
తెలుగుతో పాటు కోలీవుడ్ లో కూడా చేయాలని చూస్తున్న సాయి పల్లవికి అక్కడ ఓ లక్కీ ఛాన్స్ దొరికింది. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా వస్తున్న మారి-2 లో సాయి పల్లవిని హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట. ధనుష్ తన వండర్ బార్ ఫిలింస్ పతాకంలో ఈ సినిమా చేస్తున్నాడు. కోలీవుడ్ లో కూడా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్న సాయి పల్లవి నిజంగానే టాప్ రేంజ్ కు వెళ్లబోతుందని చెప్పొచ్చు.