విన్నర్ కాకున్నా మెగా మేనళ్లుడు మరో ఛాన్స్..!

మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ అక్టోబర్ లో జవాన్ సినిమాతో రాబోతున్నాడు. బివిఎస్ రవి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా తనకు హిట్ ఇస్తుందని అంటున్నాడు తేజ్. ఇక ఈ సినిమా తర్వాత వినాయక్ తో ఇంటెలిజెంట్ అనే సినిమా చేస్తున్న తేజ్ ఆ తర్వాత కరుణాకరణ్ తో కూడా సినిమా ఫిక్స్ చేసుకున్నాడు. ఇక ఈ రెండు సినిమాలే కాకుండా మరోసారి గోపిచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడట తేజ్.

ఆల్రెడీ ఈ ఇద్దరి కాంబినేషన్ లో విన్నర్ సినిమా వచ్చింది. ఆ సినిమా అంచనాలను అందుకోవడంలో విఫలమైంది అందుకే మరోసారి విన్నర్ కాంబో సెట్ చేయడానికి చూస్తున్నారు. ఈమధ్యనే తను రాసిన ఓ కథను తేజుకి వినిపించాడట గోపిచంద్ మలినేని దాదాపు ఓకే చెప్పేసినట్టే అంటున్నారు. అయితే జవాన్ హిట్ కొడితే కచ్చితంగా గోపిచంద్ సినిమా ఉండే అవకాశం ఉంది.