రంగస్థలం రెండు క్లైమాక్స్..!

రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో రాబోతున్న రంగస్థలం మూవీ ప్రస్తుతం సెట్స్ మీద ఉంది. పల్లెటూరి ప్రేమకథతో రాబోతున్న ఈ సినిమాలో రాం చరణ్ లుక్ అద్భుతంగా ఉండబోతుందట. సుకుమార్ తన సినిమాల లాజికల్ మార్క్ కు దూరంగా ఈ సినిమా చేస్తున్నాడని అంటున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా స్పెషల్ రోల్ లో నటిస్తుందట.

ఇక ఈ సినిమా కోసం ప్రతి సీన్ రెండు వర్షన్స్ లో తీస్తున్నారని తెలుస్తుంది. ముఖ్యంగా క్లైమాక్స్ అయితే రెండు వేరు వేరు పద్ధతుల్లో తీస్తారట. అందుకే సినిమా లేట్ అవుతుందని తెలుస్తుంది. సినిమా మొత్తం పూర్తయ్యాక చిరంజీవి సమక్షంలో ఏది ఫైనల్ చేయాలో నిర్ణయిస్తారట. మొత్తానికి రంగస్థలం కోసం సుకుమార్ హార్డ్ వర్క్ ఏ రేంజ్ లో ఉందో తెలుస్తుంది. ఇక సినిమా కూడా అంచనాలకు తగ్గట్టు ఉంటుందేమో వేచి చూడాలి.

నంవంబర్ కల్లా షూటింగ్ పూర్తి చేసి డిసెంబర్ లో ఆడియో రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఇక అనుకున్న విధంగానే సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు.