రకుల్ కొత్త లవర్ ఎవరో తెలుసా..?

సౌత్ లో సూపర్ సక్సెస్ ఫుల్ కెరియర్ ను కొనసాగిస్తున్న రకుల్ ప్రీత్ సింగ్ సినిమా సినిమాకు తన అందం అభినయంతో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇక రేపు ప్రపంచవ్యాతంగా రిలీజ్ అవుతున్న స్పైడర్ లో మహేష్ కు జతకట్టిన రకుల్ తనకు కొత్త లవ్ దొరికేసిందని ట్విట్టర్ లో చాటింపేసి మరి చెబుతుంది. ఇంతకీ రకుల్ కొత్త లవ ఎవరు అంటే తను కొనుక్కున్న కూత బెంజ్ ఎస్.యు.వి మోడల్ కార్ అని తెలుస్తుంది.

తనకు వచ్చిన రెమ్యునరేషన్ తో కొన్నట్టు తెలుస్తుండగా ఈ కార్ తో దిగిన పిక్ ట్విట్టర్ లో పెట్టి నా కొత్త లవ్ ఇదే అంటూ ట్వీట్ చేసింది అమ్మడు. టాలీవుడ్ లో రకుల్ క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. చిన్న సినిమాలతో మొదలైన ఆమె కెరియర్ స్టార్ గా అవతరించేలా చేసింది. ఈ ఇయర్ ఇప్పటికే మూడు సినిమాలతో ప్రేక్షకులను అలరించిన రకుల్ స్పైడర్ తో 4 సినిమాలను అందించిందని చెప్పాలి.