
విజయ్ దేవరకొండ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరక్షన్ లో వచ్చిన సినిమా అర్జున్ రెడ్డి. షాలిని హీరోయిన్ గా నటించిన ఈ సినిమా యూత్ ఆడియెన్స్ ను విశేషంగా ఆకట్టుకుంది. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద విజయం అందుకున్న ఈ సినిమా రీమేక్ కోసం కూడా పోటీ పడ్డారు. ముఖ్యంగా ఈ సినిమా తమిళ హక్కులను ధనుష్ సొంతం చేసుకున్నారు.
తన నిర్మాణ సంస్థ అయిన వండర్ బార్ ప్రొడక్షన్ లో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో నిన్నటిదాకా ధనుష్ హీరోగా నటిస్తాడని అనుకోగా తాజాగా ఈ సినిమాలో ఆర్యను హీరోగా తీసుకునే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే ఆర్య ధనుష్ ల మధ్య ఈ సినిమా చర్చలు జరిగాయట. ఆర్య దాదాపు ఓకే అన్నాడని తెలుస్తుంది. మొత్తానికి తెలుగులో క్రేజీ హిట్ సాధించిన అర్జున్ రెడ్డి సినిమాను తమిళంలో ఆర్య హీరోగా చేస్తూ ధనుష్ నిర్మించడం గొప్ప విషయమే చెప్పాలి.