
టైటిల్ కాస్త విచిత్రంగా ఉన్నా చిరంజీవి నటించిన ఖైది నంబర్ 150 సీక్వల్ లాంటి కథతో పవర్ స్టార్ సినిమా చేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇది ఎవరో చెబుతున్న మాట కాదు ఖైది మాత్రుక దర్శకుడు కత్తి లాంటి మురుగదాస్ అన్న మాటలు. ప్రస్తుతం మహేష్ స్పైడర్ రిలీజ్ కార్యక్రమాల్లో ఉన్న మురుగదాస్ పవర్ స్టార్ తో సినిమా అంటే ఖైది నెంబర్ 150 సీక్వల్ కథతోనే అంటున్నాడు.
తనకు సోషల్ మెసేజ్ ఉన్న సినిమాలు ఇష్టమని.. అదే పవన్ కు కావాలని అడిగారని అన్నారు మురుగదాస్. అయితే గజిని సినిమా పవన్ తో రీమేజ్ చేయాలని చూసినా అది కుదరలేదని చెప్పారు. ప్రస్తుతం స్పైడర్ తో సత్తా చాటాలని చూస్తున్న మురుగదాస్ పవన్ కు అలాంటి కథ తప్పకుండా రెడీ చేస్తానని అంటున్నాడు. పవర్ స్టార్ సోషల్ మెసేజ్ అంటే కచ్చితంగా ఆ సినిమా తన రాజకీయ భవిష్యత్ కు ఉపయోగపడుతుంది. మరి ఆ సినిమా ఎప్పుడు ఎలా తెరకెక్కుతుందో చూడాలి.