
మారుతి డైరక్షన్ లో శర్వానంద్ లీడ్ రోల్ లో యువి క్రియేషన్స్ బ్యానర్లో వస్తున్న సినిమా మహానుభావుడు. వంశీ ప్రమోద్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. సినిమా నుండి రిలీజ్ అయిన సాంగ్స్ ఇప్పటికే ప్రేక్షకులను అలరించగా ఇక కొద్ది గంటల క్రితం రిలీజ్ అయిన ట్రైలర్ కూడా ఆకట్టుకుంది.
ఈ ఇయర్ శతమానం భవతితో హిట్ అందుకున్న శర్వానంద్ ఆ తర్వాత వచ్చిన రాధ మూవీ నిరాశ పరచగా మళ్లీ ఈ మహానుభావుడుతో హిట్ కొట్టాలని చూస్తున్నాడు. తన సక్సెస్ ఫుల్ ఫార్ములా అయిన కామెడీ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రాబోతుందని ట్రైలర్ చూస్తే తెలుస్తుంది. ఇక మారుతి భలే భలే మగాడివోయ్ లో మతిమరుపు పాత్రతో హీరోని చూపించగా.. మహానుభావుడులో అతి శుభ్రత రోగాన్ని పెట్టేశాడు. మరి శర్వానంద్ కు ఈ సినిమా భలే భలే మగాడివోయ్ రేంజ్ హిట్ అవుతుందేమో చూడాలి.