కాజల్ తో రవితేజ రొమాన్స్

మాస్ మహరాజ్ రవితేజ ఇప్పుడు మళ్లీ తన కెరియర్ ను స్పీడ్ అప్ చేశాడు. బెంగాల్ టైగర్ తర్వాత దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత రాజా ది గ్రేట్, టచ్ చేసి చూడు సినిమాలతో రాబోతున్న రవితేజ ఆ సినిమాలు పూర్తి కాకుండానే మరో రెండు సినిమాలను లైన్ లో పెడుతున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే శ్రీను వైట్లతో సినిమా రవితేజ సినిమా ఉంటుందని తెలియగా వి.వి.వినాయక్ తో కూడా రవితేజ మరో సినిమా చేస్తాడని టాక్.

ఇక శ్రీనువైట్ల సినిమాలో రవితేజతో కాజల్ రొమాన్స్ చేసే అవకాశం ఉందట. ఇదవరకు వీర, సారొచ్చారు సినిమాలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న ఈ రవితేజ, కాజల్ మరోసారి ఈ సినిమాకు కలిసి నటిస్తున్నారు. ప్రస్తుతం కాజల్ మళ్లీ మునుపటి ఫాం కొనసాగిస్తుంది. చేతినిండా సినిమాలున్నా మళ్లీ అమ్మడు రవితేజ సినిమా కూడా కన్ఫాం చేసింది. ఈ సినిమా గురించి మిగతా డీటేల్స్ త్వరలో తెలుస్తాయి.