స్పైడర్ సెన్సార్ టాక్.. ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్..!

మహేష్ మురుగదాస్ కాంబినేషన్ లో రాబోతున్న స్పైడర్ మూవీ ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీలో ఒకటని చెప్పొచ్చు. ఇక ఈరోజు సెన్సార్ కార్యక్రమాలను పూరి చేసుకున్న స్పైడర్ మూవీ యు/ఏ సర్టిఫికెట్ అందుకుంది. సినిమా కూడా 2.25 గంటల డ్యూరేషన్ తో రాబోతుందట. సినిమా కంటెంట్ కొత్తగా ఉంటుందని.. ఇక గ్రాఫిక్స్ కూడా చాలా ప్రాముఖ్యత ఉంటాయని తెలుస్తుంది.

సినిమాలో సినిమాటోగ్రఫీ సంతోష్ శివన్ కూడా టేకింగ్ అద్భుతంగా ఉంటుందట. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు హారిజ్ జైరాజ్ మ్యూజిక్ అందించారు. సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోతుందట. మురుగదాస్ మార్క్ సినిమాగా ఈ సినిమా తప్పకుండా అంచనాలను అందుకునేలా ఉంటుందట. ఠాగూర్ మధు, ఎన్వీ ప్రసాద్ నిర్మించిన ఈ సినిమా తెలుగు తమిళ భాషల్లో సెప్టెంబర్ 27న రిలీజ్ అవుతుంది. మరి సెన్సార్ నుండి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా సంచలనాలు సృష్టిస్తుందో లేదో చూడాలి.