రాజా ది గ్రేట్ వచ్చేస్తున్నాడు..!

మాస్ మ‌హారాజా ర‌వితేజ న‌టిస్తోన్న లేటెస్ట్ మూవీ రాజా ది గ్రేట్. రీసెంట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీలో అంధుడి పాత్రలో కనిపించనున్నారు. అంధుడిగానే యాక్షన్ సీన్లు కూడా ఆదరగోదతాయట. పటాస్, సుప్రీం సినిమాల సక్సెస్ లతో దూసుకెళ్తున్న అనీల్ రావిపూడి ఈ సినిమాను డైరెక్ట్ చేస్తున్నారు. 

ఈ సినిమా టీజర్ లో రవితేజ యాక్షన్ సీన్లు ఆకట్టుకుంటున్నాయి. ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మిస్తున్నారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ హీరియిన్ మేహెరిన్ కౌర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ టైటిల్ ట్రాక్ ని ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు రిలీజ్ చేయబోతున్నారట. బెంగాల్ టైగర్ తర్వాత రవితేజ నటిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ మూవీలో రవితేజ అంధుడి పాత్రలో నటించడంతో అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మ్యూజిక్ కూడా అదిరిపోయేలా ఉంటుందని అంటున్నారు.